బిచ్చగాడు 2 హిట్‌ ఖాయం

విజయ్‌ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ సినిమా ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పోరేషన్‌ బ్యానర్‌ పై ఫాతిమా విజయ్‌ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు.
కావ్యా థాపర్‌ నాయికగా నటించారు. తెలుగులో ఈ సినిమాను ఉషా పిక్చర్స్‌ బ్యానర్‌పై విజయ్‌కుమార్‌, వీరనాయుడు సంయుక్తంగా రిలీజ్‌ చేస్తున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హీరోలు అడివి శేష్‌, ఆకాష్‌ పూరిలు ముఖ్య అతిథులుగా వచ్చారు. అడివి శేష్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కోసం ఫాతిమా, విజయ్‌ ప్రాణం పెట్టారు’ అని అన్నారు. ”బిచ్చగాడు’ సినిమా ఓ చరిత్రను సృష్టించింది. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్‌ అవ్వాలి’ అని ఆకాష్‌ పూరి చెప్పారు. విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ, ‘తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి. ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేస్తున్న వీరమనాయుడు, విజయ్‌కి థాంక్స్‌. భాషా శ్రీ, గౌరవ్‌, నన్ను ప్రమాదం నుంచి కాపాడిన కావ్యకు, నా భార్య ఫాతిమాకు థ్యాంక్స్‌. ఫస్ట్‌ పార్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ అన్నీ కూడా రెండో పార్ట్‌లోనూ ఉంటాయి. బిచ్చగాడు మొదటి పార్ట్‌ నచ్చిన అందరికీ కూడా రెండో పార్ట్‌ నచ్చుతుంది’ అని తెలిపారు.