విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ గురు’. మణాళిని రవి హీరోయిన్. ఈ సినిమాను విజరు ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమాను రంజాన్ పండుగ సందర్భంగా ఈనెల 11న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వినాయక్ వైద్యనాథన్ మాట్లాడుతూ, ‘ప్రేమ ద్వారా ఈ యూనివర్స్‌లో ఏదైనా సాధ్యమే అనే అంశాన్ని ఈ కథలో చెబుతున్నాం’ అని తెలిపారు. ‘ఈ సినిమాను రీసెంట్‌గా చూశాం. చాలా బాగుంది. ప్రతి సీన్ కొత్తగా ఉంది. విజయ్ ఆంటోనీ, మణాళిని మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఈ సినిమా మంచి హిట్ అవుతుంది’ అని అన్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ శశి మాట్లాడుతూ, ‘ఈ కథలో ప్రేక్షకులు ఇష్టపడే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి’ అని చెప్పారు. హీరోయిన్ మణాళిని రవి మాట్లాడుతూ,’లీల క్యారెక్టర్‌లో నటించాను. నా కెరీర్‌లో లభించిన గొప్ప క్యారెక్టర్ ఇది’ అని తెలిపారు. ‘మైత్రీ మూవీ వారితో అసోసియేట్ కావాలనేది నా డ్రీమ్. ఈ కథ విన్నాక ఇది నా కెరీర్‌లో బిచ్చగాడు తర్వాత అంత పెద్ద హిట్ అవుతుందని దర్శకుడు వినాయక్‌కు చెప్పాను. అది నిజం కాబోతున్నందుకు సంతోషంగా ఉంది’ అని హీరో విజయ్ ఆంటోనీ చెప్పారు.