నైనీషా క్రియేషన్స్, జెనియా ఎంటర్టైన్మెంట్స్, క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘స్కూల్ లైఫ్’ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. పులివెందుల మహేష్ హీరోగా నటిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సావిత్రి కష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు వి సముద్ర విచ్చేసి టీమ్‌కి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పులివెందుల మహేష్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా నా ఒక్కడిదే కాదు. సినిమా మీద ఉన్న ఇష్టంతో సినిమా కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన ప్రజల డబ్బుతో, అలాగే నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా సక్సెస్ చేస్తారు అని నమ్ముతాను. వచ్చిన బడ్జెట్ సరిపోనప్పుడు కథ నచ్చి, నన్ను నమ్మి ఇన్వెస్ట్ చేసి ఈరోజు రామానాయుడు స్టూడియోలో మూవీ ఓపెనింగ్ ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి తీసుకువచ్చిన నిర్మాత రాహుల్ త్రిశూల్‌కి కతజ్ఞతలు’ అని తెలిపారు.
‘గతంలో నేను రాంగోపాల్ వర్మ సినిమా కథని ఓటీటీకి చేశాను. యాంకర్ రవి హీరోగా ‘రాయలసీమ ప్రేమ కథ’ అని మరో సినిమా నిర్మించాను. నిర్మాతగా ఇది నాకు మూడవ సినిమా. మహేష్ నాకు ‘రాయలసీమ ప్రేమ’ కథ టైమ్ నుంచే పరిచయం. ఈ సినిమా గురించి మహేష్ చెప్పినప్పుడు కథ నచ్చి ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేసి నేను కూడా ఒక భాగమయ్యాను. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 2న స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 2 వరకు జరిగే సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తున్నాం’ అని నిర్మాత రాహుల్ త్రిశూల్ చెప్పారు. హీరోయిన్ సావిత్రి కష్ణ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మహేష్‌కి కతజ్ఞతలు. మంచి కంటెంట్ ఉన్న సినిమా ‘స్కూల్ లైఫ’్. కచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి డి ఓ పి : ధర్మ ప్రభ, సంగీతం : హర్ష ప్రవీణ్, ఎడిటర్ : నందమూరి హరిబాబు, లిరిక్స్ : ఎం అనిల్, బాలు, అసుర కె, రైటర్స్ : అనాస్, అప్పసాని మధు, వీరాంజనేయ చారి, సురేష్, నవీన్, నరసింహ, డైలాగ్స్ : అంజి తన్నీరు.