బడిబాట ప్రారంభం

నవ తెలంగాణ -ఊట్కూర్‌
రాష్ట్ర విద్యా శాఖ ఆదేశానుసారం మండల పరిధిలోని నిడుగుర్తిలో బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న బోధన విధానం, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, మనఊరు- మనబడి ద్వారా పాఠశాలలో వచ్చిన ఆధునిక ఆహ్లాదకర మార్పుల గురించి తల్లిదం డ్రులకు వివరంగా తెలియజేసి తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠ శాలలోనే చేర్పించాలని సూచించారు. మొదటిరోజూ 8మంది విద్యార్థులు పా ఠశాలలో చేరడంపై సంతోషం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానో పా ధ్యాయులు లక్ష్మారెడ్డి, సీఆర్‌ భీమయ్య, ఉపాధ్యాయులు సునీత, వెంకటప్ప, సుజాత, సలాం, లియాకత్‌, ఆంజనేయులు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
గట్టు : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు భాగంగా శనివారం అంగన్వాడీ బడిబా ట మాచర్ల, బలిగేర 1,2,3,4 సెంటర్‌లో ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను బడిలో చేర్పిం చాలని ఇంటింటికీ ర్యాలీ ద్వారా లబ్ధిదారులకు ఐసీడీ ఎస్‌ సేవల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపరవైజర్‌ వాసంతి అంగన్‌వాడీ టీచర్స్‌ లక్ష్మి, శోభ, కవిత పాల్గొన్నారు.
గట్టు: మండల కేంద్రంలో మండల విద్యాశాఖ కొండారెడ్డి బడిబాట కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవ త్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో కోరారు. విద్యార్థినీ, విద్యార్థులు ఇష్టంతో చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని, ఆ దిశగా ఆంగ్ల మాధ్యమంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠ శాలలకు దీటుగా అన్ని వ సతులతో నాణ్యమైన విద్య అందించేందుకు బడి- బాట కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కాంప్లెక్స్‌ హెడ్మాస్టర్‌, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్‌ పాల్గొన్నారు.
కొత్తపల్లిలో ర్యాలీ
మండల పరిధిలోని కొత్తపల్లిలోని అంగన్వాడీ సెంటర్‌ పిల్లల ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ బాట సందర్భంగా ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం బాలామృతం గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్‌ ఇంద్ర, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
ఉండవెల్లి: మండలంలోని బైరాపురంలో బడిబాట కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమణారావు, అంజిరెడ్డి, వ్యవసాయ అధికారులు సుబ్బారెడ్డి, సురేఖ తదితరులు పాల్గొన్నారు.