బడిబాట ప్రారంభం..

– బడీడు పిల్లలు అందరినీ బడికి పంపించండి..
– తల్లిదండ్రులకు హెచ్.ఎం హరిత పిలుపు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
పాఠశాల విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందుకోసం బడీడు వచ్చిన పిల్లలు అందరినీ బడి కే పంపాలని అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,అశ్వారావుపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి.హరిత తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది బడిబాట కార్యక్రమాన్ని నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట కాంప్లెక్సు పాఠశాలలో గురువారం ఆమె ప్రారంభించారు.  సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 6 వ తేదీ నుండి  19 వ తేదీ వరకు ప్రతిరోజు బడిబాట కార్యక్రమం నిర్వహించబడుతుంది అని ద్వారా బడి  ఈడు పిల్లల నందరిని పాఠశాలల్లో చేర్పిస్తామని అన్నారు.ఈ సందర్భంగా వివిధ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి సభ్యులు చే అవగాహనా సమావేశాన్ని నిర్వహించారు.పట్టణ వీధులలో బడిబాట ర్యాలీ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు నరసింహారావు,కిశోర్ బాబు,సీఆర్పీ ప్రభాకరాచార్యులు పాల్గొన్నారు.