సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను మండలంలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్ స్పష్టం చేశారు. శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్థాయి గ్రామ కార్యదర్శులు, అంగన్వాడి, ఆశలు, ఐకెపి సిబ్బందికి కుటుంబ సర్వే రూపకల్పన ప్రక్రియను ప్రారంభించారు. మండల పరిధిలోని ఆయా గ్రామాలలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు శ్రీకారం చుట్టాలన్నారు. రెంజల్ మండల కేంద్రంలో ఇండ్ల జాబితా రూపకల్పన కోసం చేపడుతున్న చర్యలు, పాటిస్తున్న పద్ధతుల గురించి అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి, ఇంటి తలుపు పై స్టిక్కర్లు వారు గమనించారు. ఒక్కొక్క ఇమ్యూనేటర్ కు 175 ఇండ్ల చొప్పున కేటాయించి నేటి నుంచి మూడు రోజుల వరకు ఇండ్లను సర్వే చేయాలని వారు సూచించారు. అనంతరం నవంబర్ 6 నుంచి 19 వరకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే న పూర్తి చేయాలని వారన్నారు. సర్వే పూర్తి అయిన అనంతరం కంప్యూటర్లో వాటిని నమోదు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయి అధికారులతో పాటు, ఇబ్బంది సమన్వయంతో సర్వేలు జరిపించాలని మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, సూపరిండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ రఫీ హైమద్, ఏఎస్ఓ సాయికుమార్, ఏపీఎం చిన్నయ్య, ఉపాధ్యాయులు సోమలింగం గౌడ్, కిషోర్ కుమార్, ఆనంద్, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఐకెపి సిబ్బంది, ఆశ వర్కర్ లు, పాల్గొన్నారు.