మంత్రిగా ఉండి.. బాద్యతలేని మాటలేల

– తప్పుడు నిందలతో కాంగ్రెస్ రాజకీయ పబ్బం 
– మాజీ ఎమ్మెల్యే వోడితేల సతీష్ కుమార్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్  మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. బాధ్యత లేని మాటలు ఏంటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం హుస్నాబాద్ లో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ బోయినపల్లి సరితరావు అనే యువతికి జెన్ కోలో ఏఈ మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఉద్యోగం ఇప్పించారని తప్పడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్  అన్న లేడని ఇక అన్న కూతురు ఎక్కడ నుంచి వస్తుందని, బోయినపల్లి అనే ఇంటి పేరు ఉంటే బంధువు అయినట్టేనా అని ప్రశ్నించారు. వినోద్ కుమార్ అసలు అన్న లేరని విషయం కాంగ్రెస్ నాయకులు తెలుసుకోవాలన్నారు. తప్పుడు నిందలతో కాంగ్రెస్ రాజకీయ పబ్బాం గడుపుకుంటుందని విమర్శించారు. అబద్దాలు ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిచినట్టు కాదనీ, మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ అసలు నిజమేంటో తెలుసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి కేటాయించిన నిధులన్ని రద్దు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు.రాజకీయ దురుద్దేశ్యంతో  ఆరోపణలు చేస్తున్నారనీ, కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కడిగిన ముత్యంలాంటి వ్యక్తి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ఎమ్మెల్యే ఎన్నికల్లోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని, మంత్రి అనే బాధ్యత లేకుండా మాట్లాడటం భావ్యం కాదన్నారు. పొన్నం ప్రభాకర్  మీరు మరో సారి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే తాము కూడా మాటకు మాట సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.