
ప్రేమించి పెళ్లిచేసుకొని కడవరకు తనతోనే ఉంటానని నమ్మించి తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న సాకుతో తనని వదిలేసి వెళ్లి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైటాయించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కి చెందిన ఓ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అక్షయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అక్షయ్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని తనని మోసం చేసి వదిలి వెళ్లిపోయాడని ఆ యువతి తన ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు బైటాయించడం ..ఎలా అయినా తనకు న్యాయం చేయాలని బైటాయించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆమె వెను తిరిగి వెళ్ళింది.