– పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
రైల్లో బెల్ పూరి అమ్మే వ్యక్తి మృతి చెందాడని, ఇతని వివరాలు తెలిసినవారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలనీ పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి సోమవారం తెల్లవారుజామున కామారెడ్డి పట్టణంలో కొత్త బస్ స్టాండ్ దగ్గర ఒక షాప్ ముందర పడుకొని, అక్కడనే మృతి చెంది ఉన్నాడని, ఇతని వయసు సుమారు 45-50 సంవత్సరాలు ఉండవచ్చని, ఇతడు రైలులో బెల్ పూరీ అమ్ముతాడని అతనిని చూసినవారు పేర్కొన్నారు. ఇతని వివరాలు తెలిసిన ఎవరైనా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ నందు సంప్రదించలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వ్యక్తి యొక్క మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచడం జరిగిందని మరింత సమాచారం కోసం 8712686145,
8712666242. ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.