ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బొడ్డెమ్మ వేడుకలు

నవతెలంగాణ -తాడ్వాయి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ రాంపాక అవిలయ్య గారి అధ్యక్షతన బొడ్డెమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల ఆటా పాటలతో బొడ్డెమ్మను భక్తి శ్రద్ధలతో పూజించారు. బొడ్డెమ్మ పాటలు పాడుతూ ముత్యాలు కోలాటం ఆటలు ఆడారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కొమ్మాల సంధ్య, రాములు నాయక్, భిక్షం, శ్వేత, రాజ్ కుమార్, రాజు, అశోక్, శ్రీలత, నాగరాజు, హరికృష్ణ, దివ్య విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.