నవతెలంగాణ-కాప్రా
రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులు ఎత్తేసి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను నిర్మూ లించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఈసీఐఎల్ కమలానగర్‌లో మంగళవారం ఐద్వా మేడ్చల్- మల్కాజిగిరి జి ల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐద్వా రాష్ట్ర అధ్య క్ష, కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో 80వేలకుపైగా బెల్టు షాపులను ఏర్పా టు చేసి మొత్తం రాష్ట్రాన్ని తాగుబోతులుగా మారుస్తున్నారన్నారు. మద్యా నికి బానిసై చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు. పేద కుటుంబాల్లో కూలీనాలీ చేస్తే వచ్చిన డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తు న్నారన్నారు. మద్యం మత్తులో మహిళలపై లైంగికదాడులకు పాల్పడు తు న్నారని తెలిపారు. స్వయంగా ప్రభుత్వ గుర్తింపు ద్వారా ఏర్పాటు చేస్తున్న మ ద్యం షాపులు కాకుండా ఒక్క మద్యం షాపు పర్మిషన్ తీసుకుని ఐదు బ్రాం చీలుగా నడిపిస్తున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మద్యం షాపులు సమయం పాటించకుండా 24 గంటలు ఓపెన్‌గా ఉం చు తున్నారని చెప్పారు. చదువుకునే విద్యార్థులు కూడా డ్రగ్స్, మద్యానికి బాని సై కుటుంబాలు, ప్రజలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆదాయం కోసం మద్యం షాపులను పెంచి పోషిస్తుం దన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా డ్రగ్స్, మద్యం షాపులు విపరీతంగా పెరిగిపోతున్నా యన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పత్రికా ప్రకటనలకే పరిమితమవు తుంది తప్పా, చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే డ్రగ్స్, మద్యం షాపులపై చర్యలు తీసుకుని నూతన బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వకుండా చూస్తామని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే అడ్డగోలుగా బెల్టు షాపులను ప్రోత్సహిస్తుందన్నారు. బెల్ట్ షాపులు షాపింగ్ మాల్ టైప్‌లో ఏర్పాటు చేసి ప్రజలను ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు, లైంగికదాడులు ఆగాలంటే డ్రగ్స్, బెల్ట్ షాపులను ప్రభుత్వం తొలగిం చాలనీ, లేనిపక్షంలో ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం రూపొందిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షు రాలు ఆర్.అరుణ జ్యోతి మాట్లాడుతూ డీివైఎఫ్, ఐద్వా ఆధ్వర్యంలో వైద్యం పౖ సర్వేలు, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్‌లో సర్వేలు నిర్వహిస్తామనీ, ఇందులో వచ్చిన అంశాలపై అధికారు లకు మెమోరండాల రూపంలో అందజేస్తామని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్యం మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలనీ, ధరలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐద్వా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.సజన, ఎం.వినోద, ఐద్వా జిల్లా కమిటీ నాయకులు ఎ.విజయ, సఫియా, శారద, పి.మంగ, వి.కరుణ, నజీమా, ఎస్.నాగమణి, అర్.స్వాతి, తదితరులు పాల్గొన్నారు.