– ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజేత
– కేశంపేట యూత్ సభ్యులు
నవతెలంగాణ-కేశంపేట
మండలంలో బెల్ట్ షాపులను నిలిపివేయాలని శనివారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు కేశంపేట యూత్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ మండలంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొ చ్చాయన్నారు. బెల్టు షాపుల కారణంగా యువత చెడు వ్యసనాలకు లోన వుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించాల్సిన పెద్దలు కూడా తాగుడకు బానిసలై మద్యం మత్తులో తమ బాధ్యతను మర్చిపోతు న్నారని తెలిపారు. మద్యం కారణంగా ఎంతోమంది మృతిచెందుతున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మండలంలో కొనసాగుతున్న బెల్టు షాపులను నిలిపివేసి ప్రజలను ఆదు కోవాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, రమణ రెడ్డి యుగంధర్, శ్రీకాంత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి,రాజేష్, రమేష్, మల్లేష్, శ్రీశైలం, రాజేందర్, మహేష్, శివ యువకులు తదితరులున్నారు.