డిజిటల్ కార్డుతోనే సంక్షేమ పథకాల లబ్ధి

Benefit of welfare schemes with digital card– ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్
త్వరలోనే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డిజిటల్ కార్డులతోనే సంక్షేమ పథకాల లబ్ధి పొందే విధంగా చర్యలు చేపడుతుందని డిజిటల్ కార్డులతో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వాట్సప్ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రతి కుటుంబానికీ తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ కార్డు, రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు, డిజిటల్ కార్డుతోనే రేషన్, ఆరోగ్యశ్రీ,కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ది, దానితో పాటు ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.