వైఫల్యాలు : మండలాల్లోని వివిధ కాలువలు ద్వారా సాగునీటి రైతులకు అందిస్తున్న సందర్భంలో చివరి ఆయకట్టు రైతులకు నీరు అందక పంటలు సక్రమంగా పడటం లేదని నష్టపోతున్నట్లు తూంపల్లి వీరరాఘవపురం గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. గత వేసవి పంటనందు నీళ్లు సమృద్ధిగా రాకపోవడంతో ధర్నా కార్యక్రమాలు చేపట్టారు.
లక్ష రూపాయల రుణమాఫీ కాలేదు.,
ప్రభుత్వం ఇదివరకు ప్రకటించిన రైతు రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ ఇంకా కాలేదని పలు రైతులు తెలిపారు .విషయాన్ని రైతులు బ్యాంకు దగ్గరకు వెళ్లి పరిశీలించుకుంటున్నారు.
ఉచిత మందుల పంపిణీ ఊసులేదు .,
గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన రైతులకు ఉచితంగా ఎరువులు మందులు పంపిణీ చేస్తామని ప్రకటించారని ఇదివరకు ప్రకటన ఆచరణలోకి రాలేదని ప్రభుత్వం రైతులు పేర్కొంటున్నారు.
పీఎం కిసాన్ లో కష్టాలు.,
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పంట పెట్టుబడి సహాయం రైతులకు అందరికీ సక్రమంగా అందడం లేదు, రైతు కష్టాలు పడవలసి వచ్చింది. ఇదివరకు ఇచ్చినట్లు మాదిరి కాకుండా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క ఖాతాలను పేర్లను సరిచూసి డబ్బులు జమ చేస్తున్నారు. అందులో చాలామంది రైతులు ఖాతాలు ఈ కేవైసీ చేసుకోకపోవడంతో నిలుపుదలగా ఉన్నట్లు మరియు ఆధార్,బ్యాంకు బుక్ లోని పేర్లు సరిగా లేకపోవడంతో ఇలా సక్రమంగా లేని వారికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేయడం లేదు వీటిని సరి చేసేందుకు రైతులు కష్టాలు తప్పడం లేదు.
నవతెలంగాణ- ఆత్మకూర్
గత పది సంవత్సరాలలో ఆత్మకూరు అమరచింత మండల పరిధిలోని రైతులు ప్రభుత్వం నుంచి వివిధ ప్రయోజనాలు ,వైఫలాలు కలుగుతున్నాయి.
కాల్వల ద్వారా సాగునీరు అందించడం
మండలాలకు ప్రక్కనగల జూరాల ప్రాజెక్టు నుండి వివిధ కాలువల ద్వారా వివిధ గ్రామాలకు సాగు నీరు అందించడం వలన పంట దిగుబడి పెరిగింది, నీరు సమృద్ధిగా రెండు పంటలు రైతులు పండిస్తున్నారు. రైతుబంధు సహాయం., గతంలో రైతులు పంటలు పండించేందుకు పెట్టుబడి నిమిత్తం మితికి డబ్బులు ఇచ్చే వారితో ఆశ్రయించి ఆశ్రయించేవారు. అయితే 2018 నుంచి కరీఫ్ పంట కాలం నుండి ప్రభుత్వం రైతుబంధు అందించడంతో రైతులు కొంత ప్రయోజనం పొందుతున్నారు.2022బి23 యాసంగి సీజన్ కు 9988 మంది 11, 93 ,34 ,854 రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ మండల శాఖ పేర్కొన్నది. అయితే ఇట్టి రైతుబంధు పథకం ప్రారంభంలో ఇటీ రైతుబంధు సహాయం ద్వారా భూస్వాములకు బాగుపడేందుకు ఉపయోగపడుతుందని పలు విమర్శలు వచ్చాయి. అయితే ప్రభుత్వ మాత్రం దాదాపు 80 శాతం మంది చిన్న, సన్నాకారు రైతులు ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే భూమి ఎక్కువగా ఉన్నవారు కుటుంబ సభ్యులతో ఒక్కొక్కరికి కొంత ,కొంత నమోదు చేయించారనేది అక్షర సత్యం.ఇలా చిన్న సన్నకారులు రైతులుగా మారి లబ్ధి పొందుతున్నారు .భూమి లేని నిరుపేదలు వ్యవసాయం పని చేసేవారు భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనం అందడం లేదు. భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం భూమిని పంపిణీ చేయాలని భూమిలేని రైతులు కోరుతున్నారు.
రైతు బీమా పథకం :తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతు చనిపోతే రైతు కుటుంబానికి 500000 నేరుగా ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.2022 సంవత్సరానికి గాను 30 మంది చనిపోతే దాదాపు 110,00,000 రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రస్తుత యాసంగి పంట నందు పంటలు వరి ,చేరుకు ,వేరుశనగ, పంటలు రైతులు పండిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ కేంద్రాల ద్వారా రైతులకు మందులను యూరియాను సబ్సిడీతో ఇవ్వడం జరుగుతున్నది.