ఉల్లి చేసే మేలు

Benefits of Onionవంటల్లో ఉల్లిగడ్డలను, ఉల్లికాడలను విరివిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఉల్లిచేసే మేలు అలాంటింది మరి. కాలాలతో సంబంధం లేకుండా దీని వాడకం విరివిగానే ఉంటుంది. వంటల్లోనే కాక విడిగా పచ్చి ఉల్లిగడ్డ ముక్కలను కూడా ఎక్కువగానే తీసుకుంటారు. అలాగే చిన్నపిల్లల్లో, పెద్దవారిలో నిద్రలేమిని ఇట్టే మాయం చేసే ఉల్లి.. ఆరోగ్యానికే కాదు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది.
– ముక్కులో నుండి రక్తం కారుతుంటే ఉల్లి గడ్డను మధ్యలోకి కోసి కాసేపు వాసన చూస్తే సరి.
– మూర్ఛతో బాధపడుతున్నప్పుడు ఉల్లి రసాన్ని రెండు మూడు చుక్కలు ముక్కులో వేస్తే వెంటనే తేరుకుంటారు.
– మొటిమలు, వాటి తాలూకు మచ్చలకు ఉల్లిపాయరసం, ఆలివ్‌ ఆయిల్‌ సమపాళ్లలో కలుపుకున్న మిశ్రమం చక్కని ఔషధం.
– చుండ్రు సమస్య వేధిస్తుంటే ఉల్లి రసం తలకు బాగా పట్టించాలి. ఇది చుండ్రు మాయం అవడంతో పాటు జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది.
– విషకీటకాలు, కుక్కకాటుకు ఉల్లి రసం తీసుకోవడం లేదా ఉల్లిగడ్డను దంచి గాయంపై పూసినా వెంటనే మంట తగ్గుతుంది. విషాన్ని హరిస్తుంది.
– ఎంతగా బాధించే నొప్పులకైనా ఉల్లిరసం, ఆవనూనె సమంగా కలిపి మర్దన చేస్తే చాలు వెంటనే ఉపశమనం దొరుకుతుంది.