మానవ శరీరంలో మెదడు చాలా కీలకమైన అవయవం. మెదడు ఇచ్చే సంకేతాల ఆధారంగానే శరీరంలోని ఇతర భాగాలు పనిచేస్తాయి. అందుకే మెదడు పనితీరు సరిగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు భావిస్తారు. అయితే బ్రెయిన్ పనితీరు మెరుగుపడాలంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభించే పదార్థాలు డైట్‌లో చేర్చుకోవాలి. అందులో కీలకమైనది దానిమ్మ. దానిమ్మ గింజలను డైరెక్ట్‌గా తినవచ్చు. లేదా జ్యూస్ చేసుకుని తాగవచ్చు. ఏవిధంగా తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఇందులో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి.
జ్ఞాపకశక్తి పెరుగుదల
దానిమ్మ గింజలు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తూ రుచికరంగా ఉంటాయి. వీటిలో విభిన్న పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి. తరచుగా దానిమ్మను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ పండ్లలోని సమ్మేళనాలు మంచి నిద్రను పెంపొందిస్తాయి. ఫలితంగా మెదడు మొత్తం ఆరోగ్యం బాగుపడుతుంది.
అల్జీమర్స్ ముప్పు తక్కువ
దానిమ్మలో ఎల్లాగిటానిన్స్ అనే ఒక రకమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గట్ మైక్రోబయో టాగా పనిచేస్తుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి వ్యతిరేకంగా న్యూరో ప్రొటెక్టివ్ ప్రభావాన్ని చూపుతుంది.
మెరుగైన నిద్ర
మెగ్నీషియం అధికంగా ఉండే దానిమ్మను తినడం వల్ల శరీర కండరాలు సడలిస్తాయి. దీంతో నాడీ వ్యవస్థ శాంతపడుతుంది. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. నిద్రలేమి లక్షణాలను తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది.