గత ప్రభుత్వ ఇచ్చిన హామీ ప్రకారం బెనిఫిట్స్ చెల్లించాలి

నవతెలంగాణ – పెద్దవూర
సమ్మె సందర్బంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి దండెం పల్లి సత్తెయ్య సోమవారం డిమాండు చేశారు. ఈసందర్బంగా జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈసందర్బంగా మాట్లాడుతూ..మెమో నంబర్ 1334/ఐసిడిఎస్-ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష రిటైర్మెంట్ బినెఫెట్స్ను పెంచాలని,60 ఏళ్ళు తర్వాత విఆర్ఎస్ తీసుకునే సౌకర్యం కల్పిస్తూ కొత్త జివో ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభత్వం ఏప్రిల్ 3వ తేదీన మెమో నంబర్ 1334 సర్క్యులర్ జారీ చేసిందని అన్నారు. ఇందులో 2023 సెప్టెంబర్ 5న గత ప్రభుత్వం జారీ చేసిన జివోనంబర్ 10 ప్రకారం 2024 ఎప్రిల్ 30 నాటికి 65 నిండిన నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు 1 లక్ష, హెల్పర్లకు 50 వేలు చెల్లిస్తామని, 65 ఏళ్ళు  నిండిన వారి వివరాలు అత్యవసరంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రింది స్థాయి అధికారులు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు నష్టం కల్గించే ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ రంగంలో జరిగిన పరిణామాలను కొంత సమయం కేటాయించి పరిశీలించాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2023 సెప్టెంబర్ 11 నుండి అక్టోబర్ 4 వరకు 24 రోజులు నిరవధిక సమ్మె చేశారని,ఈ సమ్మె సందర్భంగా అక్టోబర్ 4న గత మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్  సమక్షంలో చర్చలు జరిగాయని తెలిపారు.ఈ చర్చల్లో సమస్యల్లో ఒకటైన రిటెర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకు 1 లక్ష, 60 ఏళ్ళు దాటిన వారికి విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జివో ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారని తెలిపారు.ఈ హమీలను అమలు చేయాలని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్నికల అనంతరం ఇప్పటికే అనేక సార్లు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చామని అయినా ప్రభుత్వం నేటికీ కొత్త ఉత్తర్వులు జారీ చేయాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పై అంశాలను పరిశీలించి పరిష్కారం కోసం కొత్త జివో ఉత్తర్వులు ఇవ్వాల్సిన ప్రభుత్వం జీఓ ఇవ్వక పోగా  రాష్ట్ర వ్యాపంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ వ్యతిరేకించిన పాత జివో ఉత్తర్వులనే మళ్ళీ ముందుకు తెచ్చి అమలు చేయాలని  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ మనోభావాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదని తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఆర్ధికంగా నష్టం కల్గించే చర్యలు చేపడుతూ ఏక పక్షంగా, వేగవంతంగా ముందుకుపోతున్నదని అన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ అంగన్వాడీ ఉద్యోగులకు 44 రోజుల సమ్మె కాలం వేతనాలు చెల్లించిందని సమస్యలు  పరిష్కరిస్తూ కొత్తగా జివో లను ఇచ్చిందని తెలిపారు.మిగిలిన సమస్యలు జూలైలో పరిష్కరిస్తామని రాత పూర్వకమైన మినిట్స్ ను అంగన్వాడీ నాయకత్వానికి అందజేసిందని అన్నారు.కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించడం  లేదని విమర్శలు చేశారు.ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు అనేక హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక తను ఇచ్చిన హామీలను విస్మరించ్చిందని అన్నారు. గత ప్రభుత్వ హమీలు కూడా అమలు చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులను మోసం చేయడం సరైంది కాదని ఈ విధానాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని, పై అంశాలు పరిశీలించి పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీఐటియు జిల్లా నాయకులు అద్దంకి నర్సిహమ్మా, నాయకులు సరిత, సముద్రమ్మ, తదితరులు వున్నారు.