కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందజేత..

The best award given by the hands of the collector..నవతెలంగాణ – భీంగల్ రూరల్
భీంగల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో క్లస్టర్ గా విధులు నిర్వహిస్తున్న సి సి, గంగ లలిత జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకోవడం జరిగింది. మహిళా సంఘాలకు బ్యాంకు వివరాలు మరియు శ్రీనిధి రుణాలు అందిస్తూ. అన్ని ఆదాభివృద్ధి కార్యక్రమాలలో మహిళా సంఘాలకు తోడ్పాటు అందిస్తూ.. న్యూ ఎంటర్ప్రైజెస్ 100% మహిళా సంఘాలకు అందించడంలో కీలకపాత్ర పోషించినందుకు ఉత్తమ అవార్డు కలెక్టర్ గారిచే అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ సిసిగా అవార్డు అందుకున్న గంగా లలితను ఐకేపీ, ఏపీఎం రవీందర్, సీసీలు, వివోఏ లు గ్రామ సంఘ అధ్యక్షురాలు తదితరులు అభినందించారు.