స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణంలో దూపల్లి గ్రామానికి ఉత్తమ అవార్డు..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం దూపల్లి గ్రామం ఉత్తమ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణంలో భాగంగా ఎంపిక కాగా, జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా సర్పంచ్ శనిగరం సాయిరెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కే సాయిలు, ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, గ్రామ కార్యదర్శి సిహెచ్ సాయి తదితరులు పాల్గొన్నారు..