
నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లో ని తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మండల ఆర్ ఐ నారాయణ రావు పటేల్ కు ఉత్తమ సేవలందించినందుకు రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. కార్యాలయం కు వచ్చే ప్రతి ఒక్కరికి ఓపికగా సమాధానం చెప్పి, ప్రజలతో మమేకమై రెవెన్యూ సేవలు అందించడంతో ఆర్ఐ ముందు నుంచే పలువురు మన్ననలు పొందారు. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ సేవలకు గాను ప్రశంస పత్రం ఆర్ ఐ అందుకోవటంతో ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు ,ఆర్ ఐ కి అభినందనలు తెలిపారు. నా సేవలు గుర్తించి ఉత్తమ అవార్డు రావడం తో మరింత బాధ్యతను పెంచిందని ఆర్ఐ చెప్పారు. తాను ఎల్లప్పుడూ తన విధి నిర్వహణ సక్రమంగా నిర్వర్తించి, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.