ఉప్పునుంతలకు ఉత్తమ అవార్డులు

నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ చేతుల మీదుగా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలోని ఉత్తమ అవార్డులు అందుకున్న ఎస్ ఐ గురు స్వామి, ఎంపీడీవో లక్ష్మణరావు, గ్రామ సర్పంచి కట్ట సరితానంతరెడ్డి, హై స్కూల్ పాఠశాల విద్యార్థిని ఉత్తమ అవార్డులు పొందారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, ఉప్పునుంతల పంచాయతీ కార్యదర్శి రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.