నవతెలంగాణ హైదరాబాద్:తమ అంతర్జాతీయ ప్రయాణ ఖర్చులపై ఆదా చేయడానికి, సాధారణంగా వినియోగదారులు తక్కువ ఫారెక్స్ మార్క్-అప్ ఛార్జీలు కలిగిన క్రెడిట్ కార్డ్ ల కోసం చూస్తారు. అయితే, అంతర్జాతీయ యాత్రికులు క్రెడిట్ కార్డ్‌ని తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవటానికి అనేక ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్, అంతర్జాతీయంగా చేసే వినియోగం ఫై వేగవంతమైన రివార్డ్‌లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ సేవ మొదలైన ప్రయోజనాలు కూడా వినియోగదారులు గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయడంలో సహాయపడతాయి. ఇటువంటి ప్రయోజనాలు సాధారణంగా ప్రీమియం మరియు సూపర్-ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లపై అందుబాటులో ఉంటాయి. కాబట్టి, అర్హత అనేది పరిగణనలోకి తీసుకోవాల్సిన మొదటి విషయాలలో ఒకటిగా ఉంటుంది.
అంతర్జాతీయ ప్రయాణానికి క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకునే ముందు, ఆయా సంస్థలు అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. ఉదాహరణకు, ఒక కార్డ్ కాంప్లిమెంటరీ హోటల్ మెంబర్‌షిప్‌లను అందిస్తే, ఆ ప్రయోజనం ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తుందని మీరు నిర్ధారించుకోవాలి. ప్రయాణ ప్రయోజనాలతో పాటు, రివార్డ్ ప్రోగ్రామ్ మరియు ఇతర ఫీచర్‌లు కూడా మీ ఖర్చు విధానాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. తక్కువ ఫారెక్స్ మార్క్-అప్ ఫీజు, కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, హోటల్ మెంబర్‌షిప్‌లు మరియు ఇతర ప్రయోజనాల ద్వారా అంతర్జాతీయ ప్రయాణంలో గణనీయమైన పొదుపులను పొందడంలో వినియోగదారులకు సహాయపడే క్రెడిట్ కార్డ్‌లలో ఐడిఎఫ్ సి ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డ్, హెచ్ డి ఎఫ్ సి గోల్డ్ రేగాలియా క్రెడిట్ కార్డ్,ఎస్ బి ఐ కార్డ్ ఎలైట్, ఏ యు బ్యాంకు జెనీత్ +క్రెడిట్ కార్డ్, వంటివి ఉన్నాయి