వరద బాధితులకు బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ వారు నిత్యవసర సరుకులు అందజేత

నవతెలంగాణ -తాడ్వాయి
ఇటీవల కురిసిన వర్షాలకు ముంపు గురై సర్వం కోల్పోయిన మేడారం గ్రామ వాసులకు ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క పిలుపు మేరకు బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ కొడగండ్ల సహకారంతో 100 కుటుంబాలకు నిత్యవసర సరుకులు బట్టలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయి, ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదల వలన ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం అన్నారు.  స్వచ్ఛంద సంస్థల వారు కనీస నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం వరద బాధితుల గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. వరదల్లో చిక్కుకుని మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 5లక్షల రూపాయలు, ఇండ్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి, వంట సామాగ్రి కొరకు లక్ష రూపాయల సహాయం, నీట మునిగిన ఇండ్లకు లక్ష రూపాయల సహాయం అందించాలని, అలాగే వరదల వల్ల కులాలు నష్టపోయిన కుటుంబాలకు ఎకరానికి 30,000/- రూపాయల తక్షణ సహాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అర్రెం లచ్చుపటేల్, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, మాట్లాడుతూ ముద్రకోళ్ల తిరుపతి, రఘు, అనిల్, రమేష్, వెంకన్న, బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ సభ్యులు అధ్యక్షులు పెద్దపూడి
 ప్రసన్న కుమార్, నరేష్, శ్రీను, అశోక్, రమేష్, గోపి, రవి, సంపత్, అక్బర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.