విజయానంద్ కు ఉత్తమ జేఏసీ అవార్డు

Best JAC Award to Vijayanandనవతెలంగాణ – కంఠేశ్వర్ 
హైదరాబాద్ లో నిర్వహించిన జేఏసీ అలుమ్ని క్లబ్ మిడ్ కాన్ఫరెన్స్ లో సెనేటర్ విజయానంద్ కు ఉత్తమ జేఏసీ సభ్యునిగా అవార్డ్ దక్కింది. ఇట్టి అవార్డు ను జేఏసీ జాతీయ అధికారులు  వినయ్ మెహత, మనోజ్ టక్కర్, జోన్ చైర్మన్ జి వి ఎన్ రాజు, జొన్ అధ్యక్షులు గోవింద్ కంకాణి అందచేశారు. తాను చేసిన సేవ కార్యక్రమాలను గుర్తించి జేఏసీ అలుమ్ని క్లబ్ ఉత్తమ జేఏసీ సభ్యుడిగా అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు.  ఇకముందు కూడా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తానని, నాకు సహకరించిన దాతలు హెచ్2వో యు ఎస్ ఏ  చెందిన కోరడా శ్రీలత కి, గుండు నరేష్  కు  విజయానంద్ ధన్యవాదములు తెలిపారు. ఈ
కార్యక్రమంలో జేఏసీ బోర్డు  సభ్యులు డీవీఎస్ప్ గుప్త, నవీన్ చావ్లా,విశాఖసమీర్,ఇందుర్ సభ్యులు లావణ్య , శ్రీహరి, ప్రసన్న పాల్గొన్నారు.