ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు

– ఎంఈఓ ఆంధ్రయ్య
– 10జిపిఏ సాధించిన కమ్మర్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు మండల విద్యాధికారి ఆంద్రయ్య  తెలిపారు. సోమవారం వెలువడిన 2023-24 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మండలంలో మొత్తం 7 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు మొత్తం కలిపి 360 మంది పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. వీరిలో 344 మంది ఉత్త్తీర్ణత సాధించినట్లు వివరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌట్ పల్లి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హాసకొత్తూర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోనపూర్ వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మర్ పల్లి విద్యార్థి  ఫైజాన్ 10జిపిఏ సాధించినట్లు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలో  విజ్ఞాన్ జ్యోతి ఉన్నత పాఠశాలకు చెందిన వైష్ణవి అనే విద్యార్థినికి కూడా 10జిపిఏ సాధించినట్లు తెలిపారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు  95.5 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి శ్ర ఆంద్రయ్య తెలిపారు.