ఉత్తమ ప్రాధానోపాధ్యాయునికి సన్మానం

Best Principal Awardనవతెలంగాణ – ఆర్మూర్ 

రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రాథమిపాధ్యాయునిగా అవార్డు తీసుకున్న ఆలూరు ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ ఎం నరేందర్ ను శుక్రవారం ఆలూరు గంగారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు విజయభారతి తదితరులు సన్మానించినారు ..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10/10 సాధించిన ఏడుగురు విద్యార్థులు, 13 మంది ఐఐటీలో సాధించిన ఘనత హెడ్మాస్టర్ దేనని అన్నారు. నూతన మండల కేంద్రం రాష్ట్రస్థాయిలోనే గుర్తింపు పొందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ముక్కెర విజయ్, శ్రీనివాస్, ఆటో యూనియన్ నాయకులు ,ఆశ వర్కర్లు, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.