– ఉత్తమ గ్రామాలకు జిల్లా స్థాయి అవార్డుల పంపిణీ
– అదనపు కలెక్టర్ డిఎస్ వెంకన్న
నవతెలంగాణ-ములుగు
అధికారుల సమిష్టి కృషి, సమన్వయంతో పనిచేసి ఉత్తమ ఫలాలు సాదించ వచ్చునని అదనపు కలెక్టర్ డిఎస్ వెంకన్న అన్నారు.బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 ఎంపికైన 16 ఉత్తమ గ్రామాల సర్పంచ్, కార్యదర్శులకు జిల్లా అదనపు కలెక్టర్ సన్మానం చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వ్యక్తిగత గహ మరుగుదొడ్లు, వ్యక్తిగత సోక్‌పిట్‌లు, డ్రెయిన్ ఎండింగ్ పాయింట్‌ల వద్ద సోక్‌పిట్‌ల నిర్మాణం, జీపీలో పారిశుద్ధ్య నిర్వహణ ఎస్‌ఎస్జి 2023 కింద మండలం నుండి సిఫార్సు చేయబడిన జీపీఎస్ మంచి స్కోర్లు సాధించినందుకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి ఉత్తమ ఫలితాలను ఆదర్శంగా తీసుకుని మరింత ముందుకు సాగాలని,ఉత్తమ గ్రామాల ఎంపికకు కషి చేసిన సిబ్బందికి సహకరించిన ప్రజాప్రతినిధులకు అదనపు కలెక్టర్ అభినం దించారు.ఈ క్రింద తెలిపిన 16 గ్రామాలు కేంద్ర ప్రభుత్వము క్షేత్రస్థాయిలో పరిశీలను అధ్యయనంలో 2 వేల లోపు జనాభా కలిగిన గ్రామాలు కన్నాయి గూడెం మండలం ఏటూరు, మంగపేట మండలం ఏకే మల్లారం, ములుగు మండలం భూపాల్ నగర్, మహ్మద్ గౌస్ పల్లి, వెంకటాపుర్ మండలం నర్సాపూర్, 2 వేల పైన నుండి 5 వేల లోపు జనాభా కలిగిన గ్రామాలు ములుగు మండలం పత్తిపల్లి, జంగాలపల్లి, ములుగు, వెంకటాపురం మండలం వెంకటాపురం, సురవీడు, వెంకటాపూర్ మండలం వెంకటాపూర్, వాజేడు మండలం మురుమూరు, ఏటుర్ నాగారం మండలం ఏటూరునాగారం, గోవిం దరావుపేట మండలం చల్వాయి,మంగపేట మండలం కమలాపూర్ తాడ్వాయి మండలం కామారం, ఉత్తమ గ్రామాలు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులను అధికారులు శాలువా మెమొంటోలతో సత్కరించారు.ఈ సమావేశంలో డిఆర్డిఓ నాగపద్మజా, సీఈఓ ప్రసూన రాణి, డిపిఓ వెంకయ్య, జెడ్పిటిసిలు హరిబాబు, పాయం రమణ, డిఎల్ పిఓ, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, ఎస్బిఎం షర్పోనీస తదితరులు పాల్గొన్నారు.