డిచ్ పల్లి వాసికి ఉత్తమ సేవ ప్రశ పత్రం..

నవతెలంగాణ- డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 77వ స్వాంతంత్య్ర దినోత్సవం సంధర్భంగ రోడ్డు భవన నిర్మాణ శాఖా మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని చంటి పిల్లల నిపుణులు ఎం.డి పిడ్రియట్రిక్, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ దిపాక్ రాథోడ్ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో(స్పెషల్ నియోనటల్ కెర్ యూనిట్) లో ఉత్తమ సేవలు చేసిన దానికి గుర్తించి, ఉత్తమ సేవ ప్రశంస పత్రం అందుకున్నారు. పేద కుటుంబం వారికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్న పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం సమకూర్చిన వనరులను వాడుకుంటు, జిల్లా కి మంచి పేరును అందిస్తున్న డిచ్ పల్లి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ దీపక్ రాథోడ్ ను పలువురు అభినందించారు. బుదవారం ఘన్ పుర్ గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, ఇతరులు డాక్టర్ దీపక్ రాథోడ్ కు, కుటుంబ సభ్యులకు ఘనంగా అభినందించి, సన్మానించారు.అయన చేసిన సెవలను కోనియాడారు.రాబోవు రోజుల్లో ఉన్నత స్థాయి లో ప్రశంసలు అందుకోవాలని వారందరూ అకంక్షించారు.