నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు చేతి వృత్తి సంఘాల సమన్వయ కమిటీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యం కృష్ణస్వామి, క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లేశం, విశ్వకర్మ వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాళ్లబండి కుమారస్వామి, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అద్యక్షులు సాయిలు తదితరులు మంత్రిని కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వృత్తి దారులకిచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.