
దుబ్బాక నూతన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపామని టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సిలి వేరి మల్లారెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బక్క కనకయ్య అన్నారు. శుక్రవారం జప్తి లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన గ్రామస్థులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలు వతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించారు.అనం తరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడవ సారి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యర్ధులపై 53 వేల పైచిలుకు మెజార్టీ సాధించడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమ లో ఉప సర్పంచ్ సురేష్ గౌడ్, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.