రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు

–  దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్‌ సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రిగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌ రెడ్డికి దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్‌ సాధన సమితి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు దళిత క్రైస్తవుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకోవాలనీ, దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించాలని కోరారు.