రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు

– తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం రేవంత్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం నాయకులు డాక్టర్‌ బొంగు రమేశ్‌, డాక్టర్‌ లాలూ ప్రసాద్‌ రాథోడ్‌, డాక్టర్‌ నరహరి తదితరులు రేవంత్‌ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని వారు కోరారు.