నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమనగల్ ఎస్ఐ బాల్ రామ్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మంగళవారం కేఎన్ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ పలువురు యువ నాయకులతో కలిసి ఎస్ఐ బాల్ రామ్ ను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈకార్యక్రమంలో మల్లేష్ నాయక్, శ్రీను నాయక్, రాజ్ కుమార్, పాండు నాయక్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.