తెలంగాణ లో కొలువైన నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు

– తెలంగాణ లో కొలువైన నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన నిజాంబాద్ జిల్లా ఉద్యోగ జేఏసీ

నవతెలంగాణ- కంటేశ్వర్

టీఎన్జీవో కేంద్ర సంఘ ఆదేశానుసారం, శుక్రవారం ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో, జిల్లా చైర్మన్ అలుక కిషన్ అధ్యక్షతన నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసి నూతన ప్రభుత్వానికి స్వాగతం పలుకుతూ నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు సంబరాలు చేసుకోవడం జరిగింది. అనంతరం గౌరవ జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి నూతనంగా ఏర్పాటు అయిన ప్రభుత్వానికి ఉద్యోగులందరం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్  అలుక కిషన్ టీఎన్జీవోఎస్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ టీజీవో ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి టి జీవో జిల్లా అధ్యక్షులు  సంఘం అమృత్ కుమార్, కార్యదర్శి హనుమంత్ రెడ్డి , టీఎన్జీవో సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి , సలహాదారులు ఆకుల ప్రసాద్, టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యదర్శి పొల శ్రీనివాస్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ ,కార్యదర్శి బోజ గౌడ్, క్లాస్ ఫోర్ ఉద్యోగుల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాంజీ ,గోండ స్వామి, డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కిషోర్ , టిఎన్జీవో, టీజీవో అన్ని శాఖల ఫోరమ్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల ఉద్యోగులు మహిళా ఉద్యోగ సోదరీమణులు అధిక సంఖ్యలో సంబరాల్లో పాల్గొన్నారు.