వడ్డేపల్లికి శుభాకాంక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
షెడ్యూల్డ్‌ కులాల జాతీయ కమిషన్‌ సభ్యునిగా నియమితులైన వడ్డేపల్లి రాంచందర్‌ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజల కోసం పాటుపడే రాంచందర్‌ సభ్యునిగా నియమితులు కావడం ఆ వర్గాలకు మరింత మేలు చేస్తుందని ఈఎస్‌ఐసీ ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ ప్రకాశ్‌ బాబు తెలిపారు. షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన ప్రజలకు న్యాయం అందించటంలో రాంచందర్‌ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.