విద్యార్థులు తమ హ్యాండ్ రైటింగ్ ను మెరుగుపర్చుకోవడం వలన అందమైన చేతిరాత సాధ్యమవుతుందని.. తద్వారా భవిష్యత్తులో మెరుగైన అవకాశాలతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఇంచార్జ్ హెచ్ఎం వెంకట కృష్ణమాచారి ఆశాభావం వ్యక్తం చేశారు.”జాతీయ చేతిరాత” దినోత్సవం సందర్భంగా గురువారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తెలుగు,హిందీ,ఇంగ్లిష్ భాషల్లో చేతిరాతపై శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయ బృందం కృష్ణమూర్తి, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, బాలకృష్ణ, పద్మావతి, దినేష్, శైలజ, అశోక్, శేఖర్ పలువురున్నారు.