ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

– ప్రధానోపాధ్యాయులు శంకరయ్య గౌడ్‌
– ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం
నవతెలంగాణ- బొంరాస్‌పేట్‌
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య విద్యార్థులకు అందుతుందని ప్రధానోపాధ్యాయులు శంకరయ్య గౌడ్‌ అన్నారు. మండలంలోని రేగడిమైలారం పాఠశాల విద్యా ర్థులు శుక్రవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కా ర్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్ర ధానోపాధ్యాయులు శంకరయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. ప్ర భుత్వ పాఠశాలలో విద్యార్థులను మెరుగైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం సౌకర్యం ఉంటుందన్నారు ఈ కార్య క్రమంలో వెంకటయ్య మ్యాజిక్‌ బస్‌ సంస,్థ మహేంద్ర గౌడ్‌ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ నర్సమ్మ వెం కట్‌ రెడ్డి చంద్రప్ప ఉన్నారు.