
ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతర మినీ మేడారం జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించడానికి కల్యాణ మండపంలో వైద్యులు నిరంతర వైద్య సేవలందిస్తున్నారు. గురువారం కాటాపూర్, తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, వైద్య సిబ్బంది లు మెరుగైన వైద్య సేవలు అందించారు. ప్రతి రోజు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు తాడ్వాయి కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు వైద్యులు వైద్య సేవలు అందించారు. జ్వరం పీడితులకు, డయేరియా, డిహైడ్రేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. రోగులకు వైద్య సేవల నుంచి ఉచిత మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్, తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.