ప్రజలందరికీ మెరుగైన వైద్యం..

Better healthcare for all people..– హూమియోపతి వైద్యాన్ని సద్వినియం చేసుకోవాలి..
– హూమియోపతి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
ప్రజలకు మెరుగైన హూమియోపతి వైద్యాన్ని అందిస్తున్నామని నాంపల్లి ఏరియా ఆస్పత్రి ఆవరణలో గల ప్రభుత్వ హూమియోపతి డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి అన్నారు. బుధవారం నాంపల్లి ఏరియా ఆస్పత్రి ఆవరణలో గలహూమియోపతి డిస్పెన్సరీలో ని ఆమె చాంబర్ లో మాట్లాడుతూ… హూమియోపతి వైద్యం అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందన్నారు. ప్రజలు కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, జ్వరం, చికున్ గున్యా   వ్యాధులకు మందులను ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ వైద్యం రోగులలో ఇమ్యూనిటీ పెంచుతుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న రోగులు ఈ వైద్యంతో సులభంగా వాళ్ళ వ్యాధులను తగ్గించుకోవచ్చని సూచించారు. తమ డిస్పెన్సరీ పరిధిలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. వృద్ధాప్యం వైద్య శిబిరాలు కూడా నిర్వహించి వైద్య పరీక్షలు చేసి వృద్ధులకు ఉచితంగా మందులను అందించామన్నారు. హూమియోపతి వైద్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు యువత తమ జీవనశైలి మార్చుకోవాలని, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకూడదని సూచించారు. బలమైన ఆహారం పండ్లు, కూరగాయలు, పాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. బీపీ, షుగర్ రోగులను పరీక్షించి మందులను అందిస్తున్నామన్నారు. ప్రతిరోజు 9 నుంచి 4 గంటల వరకు వైద్యం అందిస్తామన్నారు. హూమియోపతి  వైద్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.