ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

– డాక్టర్లు మానవీయ కోణంలో సేవ చేయాలి
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మహేశ్వరం
వైద్యులు మానవ కోణంలో సేవ చేసి, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరం మండలంలోని మనసాన్‌ పల్లి చౌరస్తాలో విజయ చంద్ర హాస్పిటల్‌ను డాక్టర్లు ప్రవీణ్‌ కుమార్‌, స్రవంతితో కలిసి ఆమె ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి గొప్ప దన్నారు. ప్రతి ఒక్క డాక్టర్‌ సేవా భావంతో ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని సూచిం చారు. నేడు మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకమైన అంతుపట్టని వ్యాధులు సంభవి స్తున్నాయని వెల్లడించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టి కాహారాన్ని తీసుకోవాలన్నారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించి, డాక్టర్లు మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్వకోలు మాజీ ఉప సర్పంచ్‌ చంద్రయ్య యాదవ్‌, మాజీ సర్పంచ్‌ థామస్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంగోత్‌ రాజు నాయక్‌, సహకార బ్యాంకు వైస్‌ చైర్మెన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎంపీటీసీ అనుమగల్ల చంద్రయ్య, నాయకులు కంది రమేష్‌, బురమోని నరసింహయాదవ్‌, పి. ఆంజనేయులు గౌడ్‌, వెంకటేష్‌ యాదవ్‌, సుధాకర్‌ రెడ్డి, కర్నాటి మనోహర్‌, నవీన్‌, అంబయ్య యాదవ్‌, స్లేవా రెడ్డి, మంత్రి రాజేష్‌, పీఎసీఎస్‌ డైరెక్టర్‌ పోల్కం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.