మేడారం వచ్చే భక్తులకు.. మెరుగైన వైద్య సేవలు

– ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య
నవతెలంగాణ -తాడ్వాయి : మేడారం వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ములుగు జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. మేడారంలో కళ్యాణకట్టలో ఏర్పాటుచేసిన ఉచిత శిబిరంలో భక్తులకు ఆయన సొంతంగా దగ్గరుండి వైద్యం అందించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారి ముప్పయ్య మాట్లాడుతూ జాతరకు 15 రోజుల ముందు నుండి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు వైద్య శిబిరాలు గత 14 నుండి ప్రారంభించినట్లు తెలిపారు. వైద్య శిబిరాలు బుధ, గురు, ఆదివారాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఎక్కువమంది రోగులు వైద్య శిబిరానికి వచ్చారు. హైదరాబాద్ కు చెందిన అనిల్ అనే వ్యక్తికి రావడంతో మెరుగైన వైద్యం అందించారు. అలాగే మణుగూరు నుండి సత్యనారాయణ అనే వ్యక్తి కాలనీ గాయాలతో వైద్య శిబిరానికి రాగా స్వయంగా ఆయన పరీక్షించి వైద్యం అందించారు. 850 మందికి వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. వైద్య శిబిరంలో డాక్టర్ ప్రణీత్, డాక్టర్ శ్యామ్, డిపిఎమ్ఓ సంజీవరావు, హెల్త్ సూపర్వైజర్ ఖలీల్, హెల్త్ అసిస్టెంట్ చేల తిరుపతయ్య, ఏఎన్ఎంలు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.