– కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
నవతెలంగాణ-ఖమ్మం
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించి, ప్రజల్లో నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టర్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. క్యాజువాలిటి, ఫార్మసీ, వార్డులు పరిశీలించారు. రోగుల సహాయకులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల దష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోజుకు సరాసరి పేషంట్ల వివరాలు, ఏ బాధలతో ఎక్కువగా వస్తున్నది అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందుల అందుబాటును అడిగి, ఫార్మసీ వద్ద గుంపులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మందుల స్టాక్ వివరాలు పరిశీలించారు. ఎన్ని రకాల వ్యాక్సిన్‌లు ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ యూనిట్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని ప్రసవాలు చేస్తున్నదని, ఇడిడి రిజిష్టర్ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించాలని, గర్భిణులకు ముందస్తుగా సాధారణ ప్రసవాలకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన చేయాలన్నారు. వైద్యాధికారులు రోగులు, రోగుల సహాయకులతో ఆసుపత్రి సేవల గురించి వివరించి, వారికి నమ్మకం కల్గించాలన్నారు. ఆసుపత్రిలో సమస్యలు, కావాల్సిన సౌకర్యాల గురించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేదవారు ఎక్కువగా వస్తారని, వైద్యులు అందుబాటులో ఉంటూ, వారికి మెరుగైన సేవలు అందించి, వారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్. కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బి. కిరణ్ కుమార్, ఆర్‌ఎంఓలు డాక్టర్ బి. రాంబాబు, డాక్టర్ రాథోడ్ వినాయక్, డాక్టర్ అమర్ సింగ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కషి చేయాలి
లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివద్ధి, శిక్షణ కేంద్రంలో గ్రూప్-1 ఉద్యోగార్థులకు చేపట్టిన ఉచిత శిక్షణా తరగతులకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు శ్రమపై దష్టి పెట్టాలని, ఖచ్చితంగా ఫలితం వస్తుందని తెలిపారు. కలెక్టర్ ఉద్యోగార్థుల సందేహాలు నివత్తి చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.