తగ్గిస్తేనే మంచిది..

Better to reduce it..వేసవి ప్రారంభమయింది. రాత్రి వేళల్లో ఎంత చల్లగా ఉన్నా, మధ్యాహ్న సమయానికి భానుడు భగభగమంటున్నాడు. ఈ వేడి నుండి తట్టుకునేందుకు చల్లని పానీయాలు తాగుతుంటాం. అయితే అవి మజ్జిగ, లెమన్‌ వాటర్‌, ఫ్రూట్‌ జ్యూస్‌ లాంటివి కాకుండా కూల్‌డ్రింక్స్‌ వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపుతుంటారు. ఈ కూల్‌ డింక్స్‌ తాగని వారు అరుదుగా ఉంటారు. తియ్యతియ్యగా.. చల్లచల్లగా.. ఉండే ఈ శీతల పానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల కలిగే అనర్ధాలేంటో తెలుసా..?
– కూల్‌ డ్రింక్స్‌లో స్వీట్‌ సోడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రుచి కోసమే ఎక్కువ మంది శీతల పానీయాలు తాగుతుంటారు. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా ఆరోగ్యానికి హాని చేస్తాయి.
– ఈ కూల్‌ డ్రింక్స్‌లో అత్యధిక స్థాయిలో చక్కెర ఉంటుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
– ఓ అధ్యయనం ప్రకారం కూల్‌ డ్రింక్స్‌ తాగిన వారిలో ఒబెసిటీ (ఊబకాయం) సమస్యలు పెరుగుతాయి.
– కూల్‌ డ్రింక్స్‌ ఎప్పుడో ఒకసారి తాగితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ తరచూ తాగితే గుండె సంబంధ వ్యాధులు కూడా వస్తాయి.
– శీతల పానీయాలతో ఎసిడిటీతో పాటు జీర్ణ సంబంధ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలతో ఇబ్బంది పడతారు.
– కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువ తాగే వారిపై సర్వే చేయగా.. వారిలో ఎక్కువ మంది అనారోగ్య సమస్యలకు గురయినట్లు అధ్య యనంలో తేలింది. అందుకే కూల్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉండడం మంచింది.a