– నారాయణమూర్తి ఆరోగ్యంపై మంత్రి దామోదర
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తికి మెరుగైన చికిత్సనందించాలని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. అనారోగ్యంతో చికిత్స కోసం నారాయణమూర్తి నిమ్స్ లో చేరిన నేపథ్యంలో మంత్రి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. నారాయణమూర్తి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు డాక్టర్ బీరప్ప మంత్రికి వెల్లడిచారు. అనుభవజ్ఞులైన డాక్టర్లతో నారాయణమూర్తికి చికిత్సనందించాలని మంత్రి సూచించారు.