– కాంగ్రెస్ యువ నాయకుడు గాదె శివ చౌదరి
నవతెలంగాణ కూకట్ పల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతికి తావులేదని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ చౌదరి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో పేదలు, లబ్ధిదారులకు ఎవరికి ఇల్లు మంజూరు చేయనందున, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబడతయి.ప్రస్తుతం సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. లబ్ధిదారులు వారికి నచ్చిన విధంగా వారి సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంది. పార్టీని ఆప్రతిష్టపాలు చేయదలచిన కొంతమంది వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది, అలాంటి ఆకతాయిల దృష్టిలో పడి మీరు మోసపోకండి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని మిమ్ములను డబ్బులు అడిగి మోసం చేయదలచిన వ్యక్తులపై కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ గారికి మీరు పిర్యాదు చేయవచ్చు. ప్రజలను మోసం చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోబడతాయి. లబ్ధిదారుల ఎంపిక అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా జరుగుతుంది. అర్హులందరికీ తప్పనిసరిగా ఇల్లు మంజూరు చేయబడతాయి. అయితే అందరికీ ఒకేసారి ఇవ్వలేము కాబట్టి విడతల వారీగా మంజూరు చేయబడతాయి గమనించగలరు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇల్లు చేకూరుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలోనే తెలియజేశారని శివ చౌదరి తెలిపారు.