ప్రజల నుండి లంచాలు తీసుకునే అవినీతి అధికారులు జాగ్రత్త!

Beware of corrupt officials who take bribes from people!– లంచం అడుగుతే నా దగ్గరికి రండి
– జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసు కుంటామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.జుక్కల్ నియోజక వర్గంలోని రెవెన్యూ డిపార్టుమెంట్లో కొంతమంది ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారులంచాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరి చిట్టా తన వద్ద ఉన్నదని,పనితీరు మార్చుకోవాలని హెచ్చరించార. రెండు లేదా మూడు గుంటల భూమికి రిజి స్ట్రేషన్ చేయడానికి రకరకాలు ఇబ్బందులు పెడుతూ రూ. 2000 నుండి 5000 రూపాయల వరకు డిమాండ్ చేయడం మంచిదికాదన్నారు.ఇలాంటివాటిని ఎట్టిపరిస్థి తుల్లో ఉపేక్షించేదిలేదని, ప్రజలకు సేవ చేయడం ప్రభుత్వ అధి కారుల బాధ్యత అని పేర్కొన్నారు.ఒక్కరూ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేద న్నారు.ఎవరైనా లంచం తీసుకుంటున్నట్లు తెలిస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.అటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేపిస్తామనిఅవినీతి అధికారుల భరితం పడతామని హెచ్చరించారు.