– ఏఎస్సై అంజాద్
నవతెలంగాణ-బంట్వారం
సైబర్ నేరగాళ్లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏఎస్సై అంజాద్ అన్నారు. బుధవారం బంట్వారం బస్‌స్టాండ్ అవరణలో పోలీసు బందం తో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏఎస్సై అంజాధ్ మాట్లా డుతూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రజాపాలన దరఖాస్తులో వివరాలు సేక రించి ప్రజలకు రేషన్ కార్డుకు, అకౌంట్ వివరాలు తెలుసుకొని ఓటీపీ చెప్పాలని అడుగుతున్నారని ఫోన్‌లో వచ్చే ఎలాంటి ఓటీపీలూ చెప్పకూ డదని, మోసపోయి చెపితే మీ అకౌంట్‌లు నుంచి అమౌంట్ మాయం చేస్తారన్నారు. అలాగే ఫ్రీ బస్‌జర్నీ అంటూ మహిళలు అనవసర జర్నీ చే యకూడదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అవసరముంటేనే బస్ ల్లో జర్నీ చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ప్రజలున్నారు.