తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నా భారీ వర్షాలతో జాగ్రత్త..!

– కూలీ పోయే ఇండ్లలో ఉండొద్దు…!
– చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దు…!
– విద్యుత్ స్తంభాలతో జాగ్రత్త వహించాలి.
నవతెలంగాణ- కంటేశ్వర్
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ పట్టణ పరిదిలోని ప్రజలు జాగ్రత్తంగా ఉండాలని పట్టణ వృత్తా వలయాధికారి నరహరి గురువారం పేర్కొన్నారు. ప్రస్తుతం భారీ, అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో పట్టణంలోని అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలీ పోయే ప్రమాదంలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు తరలివెళ్లాలని అన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉండే ఇండ్లలోకి వర్షపునీరు చేరకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు సమీపంలోని, నాలాలు, చెరువులు, వాగుల వద్దకు వెళ్లరాదని, పిల్లలు,యువకులు వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ స్థంబాల వద్దకు, ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లతో, కరెంటు మోటార్లతో జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విదముగా దయచేసి రోడ్లను గమనించి మీ వాహనాలను సురక్షితంగా నడపండి  సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి. దయచేసి ప్రమాదాలను నివారించండి. అత్యవసరమైన పరిస్థితుల్లో డయల్ 100, కానీ
2 పట్టణ ఎస్సై అశోక్ 8712659838,
3 వ పట్టణ ఎస్సై ప్రవీణ్ 8712658839,
4 వ పట్టణ ఎస్సై సంజీవ- 8712659840
పట్టణ సిఐ నరహరి 8712659836 నెంబర్ లను సంప్రదించాలని పేర్కొన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సహకారాలు అందిస్తామన్నారు.