ఎవరి వీపు వారికి కనిపించదన్నట్టు…. ఎవరి తప్పులు వారికి కనిపించవు. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. పదేండ్లు చేసిన తప్పులను సరిదిద్దుకోకుంగా.. అ పూట గండం గడిచేందుకు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తోంది గులాబీ పార్టీ. తాము అధికారంలో ఉన్నప్పుడు లేని భయాలను ఐదు నెలల రేవంత్ సర్కార్ పాలనలో సృషించి పబ్బం గడుపుకునేందుకు బీఆర్‌ఎస్ నానా తంటాలు పడుతోంది. తెలంగాణ ప్రజల్లో మరోసారి భావోద్వేగాలను రెచ్చగొట్టి లోకసభ ఎన్నికల్లో పరువు నిలుపుకునేందుకు పాకులాడుతున్నది. ”హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులం టున్నారు. రేవంత్‌రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని సన్నాయి నొక్కులు నొక్కుతూ అసహనాన్ని వెళ్లగక్కుతున్నది గులాబీ దళం. తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.
– కె.నరహరి