దసరాని మించి..

Beyond Dussehra..నాని, డైరెక్టర్‌ వివేక్‌ ఆత్రేయ మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఎస్‌జే సూర్య పవర్‌ ఫుల్‌ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఈనెల 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ,’మన మధ్యలో ఒక ప్రామిస్‌, ఒక బాండ్‌ ఉంది. ఈ బాండ్‌ని ఇంకా ఇంకా బలపరిచే సినిమా ఇది. ఈసారి థియేటర్లలో కాన్సర్ట్‌లా ఉంటుంది. జేక్స్‌ బిజోరు చితకొట్టేస్తున్నాడు. ఎప్పుడెప్పు మీరు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. మీతో పాటు చూడటానికి ఎదురుచూస్తున్నాను. సుదర్శన్‌ 35 ఎంఎం కి మార్నింగ్‌ 11 షోకి వస్తున్నాను. కలసి సెలబ్రేట్‌ చేసుకుందాం. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఈనెల 24న జరగబోతోంది. సినిమా బ్లాక్‌బస్టర్‌ ఖాయం’ అని అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత దానయ్య బ్యానర్‌ నుంచి వస్తున్న ఈ సినిమా తెలుగు స్టేట్స్‌ డిస్ట్రిబ్యుషన్‌ రైట్స్‌లో నన్ను పార్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌’. నాని నటించిన ‘దసరా’ని ఈ సినిమా బీట్‌ చేయబోతోందని ట్రైలర్‌ చూసి కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు’ అని దిల్‌ రాజు చెప్పారు. హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ మాట్లాడుతూ,”గ్యాంగ్‌ లీడర్‌’ తర్వాత నానికి జోడిగా ఈ సినిమాతో రావడం ఆనందంగా ఉంది. డీవీవీ ప్రొడక్షన్‌లో ఈ సినిమాతో పాటు ‘ఓజీ’తో మళ్ళీ వస్తున్నాను. ఇందులో నా పాత్ర పేరు చారులత. చాలా సాఫ్ట్‌ కాప్‌. వివేక్‌ చాలా బ్యూటీఫుల్‌ కథని రాశారు’ అని అన్నారు. నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ, ‘సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నాని. డైరెక్టర్‌ అద్భుతమైన కథ రాశారు, గొప్పగా తీశారు. సూర్య, ప్రియాంకలతోపాటు ఇతర నటీనటుల నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతాయి’ అని చెప్పారు.